మద్యం దుకాణాల దరఖాస్తుల ద్వారా ప్రభుత్వానికి రూ.2,854 కోట్ల ఆదాయం

మద్యం దుకాణాల దరఖాస్తుల ద్వారా ప్రభుత్వానికి రూ.2,854 కోట్ల ఆదాయం


హైదరాబాద్‌: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఖజానాకు మద్యం దుకాణాల దరఖాస్తుల ద్వారా భారీ ఆదాయం లభించింది. రాష్ట్ర వ్యాప్తంగా 2,620 మద్యం దుకాణాల లైసెన్సుల కోసం మొత్తం 95,137 దరఖాస్తులు సమర్పించబడ్డాయి. ఒక్కో దరఖాస్తుపై రూ.3 లక్షల చొప్పున రుసుం వసూలు చేయడంతో ప్రభుత్వం రూ.2,854 కోట్లు ఆదాయం పొందింది.

2023లో ఒక్కో దరఖాస్తుకు రూ.2 లక్షల ఫీజు ఉండగా, అప్పుడు ప్రభుత్వం రూ.2,640 కోట్లు ఆదాయం పొందింది. ఈసారి రుసుం రూ.3 లక్షలకు పెంచడంతో దరఖాస్తుల సంఖ్య కొంత తగ్గినప్పటికీ, గతం కంటే ఎక్కువ ఆదాయం వచ్చింది.

రాబోయే రోజుల్లో లాటరీ ద్వారా ఎంపిక చేసిన దరఖాస్తుదారులకు మద్యం దుకాణాల లైసెన్సులు జారీ చేయనున్నట్లు ఎక్సైజ్‌ శాఖ అధికారులు తెలిపారు.

కామెంట్‌లు లేవు

Blogger ఆధారితం.