శ్రీరామ్ సాగర్ ప్రాజెక్ట్ అధికారులు జాగ్రత్త సూచన జారీ

శ్రీరామ్ సాగర్ ప్రాజెక్ట్ అధికారులు జాగ్రత్త సూచన జారీ


శ్రీరామ్ సాగర్ ప్రాజెక్ట్ పరిధిలో ఎగువ ప్రాంతాల నుండి వరద నీరు భారీగా ప్రవహిస్తోంది. ఈ నేపథ్యంలో ప్రాజెక్టు అధికారులు తెలిపారు, ఈరోజు ఉదయం 10 గంటలకు ప్రాజెక్టు స్పిల్‌వే గేట్లు ఎత్తి గోదావరి నదిలోకి వరద నీటిని విడుదల చేయనున్నట్లు ప్రకటించారు.

దీనితో గోదావరి నదిలో నీటి ప్రవాహం ఒక్కసారిగా పెరగనుంది.
అందువల్ల ప్రాజెక్టు దిగువ ప్రాంతాల్లో —

  • చేపలు పట్టేవారు,
  • పశువుల కాపర్లు,
  • గొర్ల కాపరులు,
  • రైతులు,
  • మరియు సామాన్య ప్రజలు

జాగ్రత్తగా వ్యవహరించాలని, గోదావరి నదిలో దిగడం లేదా దాటే ప్రయత్నాలు చేయవద్దని అధికారులు విజ్ఞప్తి చేశారు.

జీవన భద్రత దృష్ట్యా, నది తీర ప్రాంతాల ప్రజలు వెంటనే సురక్షిత ప్రదేశాలకు వెళ్లి ఉండాలని సూచించారు. శ్రీరామ్ సాగర్ ప్రాజెక్ట్ అధికారులు


కామెంట్‌లు లేవు

Blogger ఆధారితం.