గ్రామ సర్పంచ్‌గా పోటీ చేయాలనుకునే వారికి అవసరమైన అర్హతలు – పూర్తి వివరాలు
గ్రామ పంచాయతీ ఎన్నికలు దగ్గరపడుతున్నాయి. ఈ సారి యువత, మహిళలు ఎక్కువ ఆసక్తి చూపుతున్నారు. అయితే సర్పంచ్‌గా పోటీ చేయాలంటే తప్పనిసరిగా కొన్ని అర్హతలు ఉండాలి. అలాగే కొన్ని పరిస్థితుల్లో వ్యక్తులు పోటీ చేయకుండా అనర్హులుగా పరిగణిస్తారు.
🟢 అర్హతలు (Eligibility):
- అభ్యర్థి తప్పనిసరిగా అదే గ్రామ పంచాయతీకి స్థానికుడై ఉండాలి.
- పేరు తప్పనిసరిగా పంచాయతీ ఓటర్ల జాబితాలో నమోదు అయి ఉండాలి.
- నామినేషన్ వేయు సమయానికి అభ్యర్థి వయసు 21 సంవత్సరాలు పూర్తి అయి ఉండాలి.
- ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గాలకు చెందిన వారు కూడా జనరల్ కేటగిరీ నుంచి పోటీ చేయవచ్చు.
- మహిళలకు రిజర్వు చేసిన స్థానాల్లో మాత్రమే కాదు, అదే కేటగిరీకి చెందిన జనరల్ స్థానాల్లో కూడా పోటీ చేసే అవకాశం ఉంది.
🔴 అనర్హులు (Disqualification):
- ప్రభుత్వ ఉద్యోగులు – కేంద్ర, రాష్ట్ర, గ్రామ సేవకులు, స్థానిక సంస్థలు, ఎయిడెడ్ ఇన్స్టిట్యూషన్ల ఉద్యోగులు.
- చట్టబద్ధ సంస్థల ఉద్యోగులు – ఏ ప్రభుత్వ చట్టం ప్రకారం ఏర్పడిన సంస్థలలో పనిచేసేవారు.
- నేరస్తులు – నేరంలో శిక్షపడిన వారు.
- శిక్ష అనుభవించి 5 సంవత్సరాలు పూర్తికాకపోయిన వారు.
- మతిస్థిమితం లేని వారు, చెవిటివారు, మూగవారు.
- పౌరహక్కుల పరిరక్షణ చట్టం – 1955 కింద కేసులో శిక్షపడిన వారు.
- దివాళాదారులు – కోర్టులో దివాళా పిటిషన్ పెట్టుకున్న వారు లేదా రుణ విమోచన పొందని వారు.
- గ్రామ పంచాయతీకి బకాయి ఉన్న వారు – బకాయిల చెల్లింపుకు నోటీసులు వచ్చినా చెల్లించని వారు.
- ఇద్దరికి మించి పిల్లలు కలిగిన వారు.
- అవినీతి లేదా విశ్వాస ఘాతుకం కారణంగా ఉద్యోగం నుంచి తొలగించబడిన వారు, తొలగింపు తేదీ నుంచి 5 సంవత్సరాలు పూర్తయ్యేంతవరకు.
- గ్రామ పంచాయతీ, మండల, జిల్లా పరిషత్ లేదా ప్రభుత్వ పనులకు కాంట్రాక్టు/ఒప్పందం చేసుకున్న వారు.
👉 అంటే, 21 ఏళ్లు నిండిన, స్థానిక ఓటరుగా నమోదు అయిన, ఎటువంటి నేర శిక్షలు లేదా బకాయిలు లేని వ్యక్తి సర్పంచ్‌గా పోటీ చేయవచ్చు.
Post a Comment