ఇంటి శుభ్రతే భద్రత పాము పట్టిన రక్షక బృందం!
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా హేమచంద్రపురంలో ఈ రోజు మధ్యాహ్నం ఏడు అడుగుల పొడవైన పాము ఒక ఇంటి వంటగదిలోకి చొరబడడంతో కుటుంబ సభ్యులు భయాందోళనకు గురయ్యారు. సమాచారం అందుకున్న వెంటనే ప్రాణధార ట్రస్ట్ స్నేక్ రెస్క్యూ స్పెషలిస్ట్ సంతోష్ మొబైల్ నెంబర్ +91 94915 43291 బృందంతో అక్కడికి చేరుకుని సుమారు రెండు గంటలపాటు శ్రమించి, ఫ్రిజ్ కింద దాక్కున్న పామును విజయవంతంగా పట్టుకుని సురక్షితంగా బంధించారు.
ఈ సందర్భంగా సంతోష్ మాట్లాడుతూ — “ఇంటి చుట్టూ ఉన్న నిరుపయోగ వస్తువులు, చెత్త మరియు చెదలు పాములకు ఆశ్రయం కల్పిస్తాయి. పరిసరాలను శుభ్రంగా ఉంచడం మన భద్రతకు కీలకం” అని ప్రజలకు అవగాహన కల్పించారు.
ఈ రెస్క్యూ ఆపరేషన్‌లో ప్రాణధార ట్రస్ట్ సభ్యుడు నారదాసు శ్రీకాంత్ (చోటు) కూడా పాల్గొన్నారు. పాము పట్టిన అనంతరం స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు.

Post a Comment