సర్పాన్ని రక్షించిన సంతోష్‌ను అభినందించిన కలెక్టర్ జితేష్ వి. పాటిల్

సర్పాన్ని రక్షించిన సంతోష్‌ను అభినందించిన కలెక్టర్ జితేష్ వి. పాటిల్


భద్రాద్రి కొత్తగూడెం : అక్టోబర్ 24: జిల్లా కలెక్టర్ క్యాంప్‌ కార్యాలయంలో శుక్రవారం ఉదయం సర్పం దర్శనమివ్వడంతో ఆఫీసు సిబ్బందిలో ఆందోళన నెలకొంది. సమాచారం అందుకున్న ప్రాణధార ట్రస్ట్ వ్యవస్థాపక అధ్యక్షుడు, మున్సిపల్ కార్పొరేషన్ స్నేక్ రెస్క్యూ స్పెషలిస్ట్ సంతోష్ తక్షణమే అక్కడికి చేరుకుని, పామును సురక్షితంగా పట్టి బంధించాడు.

ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్ సంతోష్‌ను అభినందించారు. ప్రాణధార ట్రస్ట్ కార్యకలాపాలు, స్నేక్ రెస్క్యూ సేవలపై వివరాలు తెలుసుకున్నారు. సర్పరక్షణ పరికరాల కోసం తగిన సహకారం అందిస్తానని కలెక్టర్ హామీ ఇచ్చారు.

జిల్లా కేంద్రంలో స్నేక్ రెస్క్యూ ప్రదర్శనశాల ఏర్పాటు చేస్తే ప్రజలకు విషపూరిత, విషరహిత, అరుదైన సర్పాలపై అవగాహన పెరుగుతుందని ఆయన అభిప్రాయపడ్డారు. జువాలజీ విద్యార్థులు, యువత, స్కౌట్స్ అండ్ గైడ్స్ సభ్యులకు శిక్షణ ఇచ్చేలా చర్యలు తీసుకోవాలని సంతోష్‌కు సూచించారు.

భద్రాద్రి జిల్లా ఏజెన్సీ ప్రాంతం కావున సర్పాలు తరచుగా కనిపించే అవకాశం ఉందని, ఈ సేవలను జిల్లా వ్యాప్తంగా విస్తరించడం వల్ల ప్రమాదాలు తగ్గుతాయని కలెక్టర్ పేర్కొన్నారు. ప్రజల్లో అవగాహన పెంచితే భయం తగ్గి సర్పాలను చంపకుండా రక్షించగలరని తెలిపారు. దీనికి అవసరమైన చర్యలను సంబంధిత శాఖలతో చర్చించి చేపడతానని హామీ ఇచ్చారు.


కామెంట్‌లు లేవు

Blogger ఆధారితం.