ఔటర్ రింగ్ రోడ్డుపై కారు మంటల్లో దగ్ధం!ఏడుగురు ప్రాణాలతో బయటపడ్డ ఘటన

ఔటర్ రింగ్ రోడ్డుపై కారు మంటల్లో దగ్ధం!ఏడుగురు ప్రాణాలతో బయటపడ్డ ఘటన


హైదరాబాద్, అక్టోబర్ 24: కర్నూలు బస్సు ప్రమాదం మరువకముందే మరో ప్రమాదకర సంఘటన ఔటర్ రింగ్ రోడ్డుపై చోటుచేసుకుంది. సంగారెడ్డి జిల్లా పటాన్‌చెరు సమీపంలోని ముత్తంగి వద్ద ఓ కారు ఒక్కసారిగా మంటల్లో ఆవృతమైంది.

సిద్ధిపేట నుంచి హైదరాబాద్‌ వైపు శుభకార్యానికి వెళ్తున్న కుటుంబ సభ్యులు ప్రయాణిస్తున్న ఆ కారు ముత్తంగి ఓఆర్‌ఆర్‌ పైకి చేరుకున్న కొద్ది సేపటికే మంటలు చెలరేగాయి. ఆ సమయంలో వాహనంలో ఏడుగురు ఉన్నారు. వారు అప్రమత్తంగా కిందికి దిగిపోవడంతో ప్రాణాపాయం తప్పింది.

అటుగా వెళ్తున్న పటాన్‌చెరు బీఆర్‌ఎస్ నేత మాణిక్ యాదవ్ వెంటనే సహాయానికి ముందుకొచ్చారు. అనంతరం అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకొని మంటలను అదుపు చేశారు. అయితే కారు పూర్తిగా దగ్ధమైంది. సకాలంలో బయటపడడంతో కుటుంబ సభ్యులు సురక్షితంగా ఉన్నారని పోలీసులు తెలిపారు.


కామెంట్‌లు లేవు

Blogger ఆధారితం.