తెలంగాణలో జాయింట్ కలెక్టర్ పదవి రద్దు
హైదరాబాద్, అక్టోబర్ 24: తెలంగాణ రాష్ట్రంలో జాయింట్ కలెక్టర్ పదవిని రద్దు చేస్తూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలోని అన్ని జిల్లాల అదనపు కలెక్టర్లను ఇకపై ఫారెస్ట్ సెటిల్‌మెంట్ ఆఫీసర్లుగా (Forest Settlement Officers) నియమిస్తూ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది.
ఈ నిర్ణయం 1967 ఫారెస్ట్ యాక్ట్ కింద తీసుకోబడింది. అటవీ భూముల సర్వే, హక్కుల నిర్ధారణ, సెటిల్‌మెంట్ వంటి పనులు ఈ అధికారుల పరిధిలోకి వస్తాయి. ఈ ప్రక్రియను ప్రిన్సిపల్ చీఫ్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ పర్యవేక్షణలో అమలు చేయాలని ప్రభుత్వం స్పష్టం చేసింది. ఈ మేరకు అన్ని జిల్లాల కలెక్టర్లు, రెవెన్యూ అధికారులు తగిన చర్యలు చేపట్టాలని ఆదేశాలు జారీ చేసింది.
ఫారెస్ట్ సెటిల్‌మెంట్ ఆఫీసర్ల బాధ్యతలు
ఫారెస్ట్ సెటిల్‌మెంట్ ఆఫీసర్లు అటవీ భూముల హక్కుల నిర్ధారణ, అటవీ ప్రాంతాల సరిహద్దుల నిర్ణయం, భూముల వివరాల పరిశీలన, అవకతవకల విచారణ, అటవీ భూముల ప్రకటనలు జారీ వంటి కీలక పనులు నిర్వర్తిస్తారు. వీరికి అటవీ ప్రాంతాల్లో విచారణ జరిపే అధికారం ఉంటుంది. ఈ నియామకాలు 1927 ఫారెస్ట్ యాక్ట్ ప్రకారం జరుగుతాయి.

Post a Comment