తెలంగాణ జాగృతి ‘జాగృతి జనం బాట’ ప్రారంభం

 

తెలంగాణ జాగృతి ‘జాగృతి జనం బాట’ ప్రారంభం

హైదరాబాద్, అక్టోబర్ 25 : తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత నేటి నుంచి ప్రజా యాత్ర *‘జాగృతి జనం బాట’*ను ప్రారంభించనున్నారు. ఉదయం 9.30 గంటలకు హైదరాబాద్‌ గన్‌పార్క్‌లోని అమరవీరుల స్తూపం వద్ద నివాళులు అర్పించి మీడియాతో మాట్లాడతారు. అనంతరం మధ్యాహ్నం 1 గంటకు నిజామాబాద్‌ ఇందల్వాయి టోల్‌గేట్‌ వద్దకు చేరుకుంటారు.

ఆమెకు అక్కడ కార్యకర్తలు ఘన స్వాగతం పలికే ఏర్పాట్లు చేశారు. రాష్ట్రవ్యాప్తంగా నాలుగు నెలల పాటు సాగే ఈ యాత్రలో కవిత మహిళలు, విద్యార్థులు, నిరుద్యోగులతో భేటీ అవుతూ ప్రజా సమస్యలను తెలుసుకోనున్నారు.

➡️ జాగృతి జనం బాటకు శ్రీకారం – గన్‌పార్క్‌లో నివాళులర్పించిన కవిత

కామెంట్‌లు లేవు

Blogger ఆధారితం.