దీపావళి పండుగ పూట విషాదం రెండు బైకులు డీ ఇద్దరు మృతి

దీపావళి పండుగ పూట విషాదం రెండు బైకులు డీ ఇద్దరు మృతి


జగిత్యాల జిల్లాలో పండుగ రోజు విషాదం నెలకొంది. గొల్లపల్లి మండలం గోవిందుపల్లి సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు యువకులు మృతి చెందగా, మరో వ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడు.

వివరాల ప్రకారం — గోవిందుపల్లి వద్ద ఎదురెదురుగా వస్తున్న రెండు ద్విచక్ర వాహనాలు ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో సంఘటనా స్థలంలోనే ఇద్దరు మృతిచెందగా, మరో వ్యక్తిని తీవ్ర గాయాలతో జగిత్యాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

మృతుల్లో ఒకరు గోవిందుపల్లి గ్రామానికి, మరొకరు వెల్గటూర్ మండలం రాంనూర్ గ్రామానికి చెందినవారిగా పోలీసులు గుర్తించారు.

దీపావళి వేళ ఇలాంటి ప్రమాదం చోటుచేసుకోవడంతో స్థానికంగా విషాద ఛాయలు అలుముకున్నాయి. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

కామెంట్‌లు లేవు

Blogger ఆధారితం.