కానిస్టేబుల్ ప్రమోద్ కుటుంబానికి రూ.1 కోటి నష్టపరిహారం ప్రకటించిన సీఎం రేవంత్ రెడ్డి
నిజామాబాద్‌లో హత్యకు గురైన పోలీస్ కానిస్టేబుల్ ప్రమోద్ కుటుంబానికి రాష్ట్ర ప్రభుత్వం పెద్ద ఎత్తున సాయం ప్రకటించింది.
📌 ముఖ్య వివరాలు:
- ప్రమోద్ కుటుంబానికి రూ. 1 కోటి నష్టపరిహారం మంజూరు
- పోలీస్ వెల్ఫేర్ ఫండ్ నుంచి రూ. 8 లక్షలు, పోలీస్ భద్రతా సంక్షేమ నిధి నుంచి రూ. 16 లక్షల ఎక్స్‌గ్రేషియా
- కుటుంబానికి 300 గజాల ఇంటి స్థలం కేటాయింపు
- కుటుంబ సభ్యుల్లో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వనున్నట్లు ప్రకటించిన సీఎం రేవంత్ రెడ్డి
🔹 ఈ ఘటనతో రాష్ట్రవ్యాప్తంగా పోలీసులు దిగ్భ్రాంతికి గురయ్యారు.
🔹 కానిస్టేబుల్ ప్రమోద్ విధి నిర్వాహణలో ప్రాణాలు కోల్పోవడం పట్ల సీఎం రేవంత్ రెడ్డి తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు.
🔹 కుటుంబానికి అండగా నిలుస్తామని, ఇలాంటి సంఘటనలు మళ్లీ జరగకుండా చర్యలు తీసుకుంటామని తెలిపారు.

Post a Comment