ఎస్సీ, ఎస్టీ బీఏఎస్‌ స్కీమ్‌ స్కూల్ ఫీజులు ప్రభుత్వం వెంటనే విడుదల చేయాలి

 

ఎస్సీ, ఎస్టీ బీఏఎస్‌ స్కీమ్‌ స్కూల్ ఫీజులు ప్రభుత్వం వెంటనే విడుదల చేయాలి

ఎస్సీ, ఎస్టీ బీఏఎస్‌ స్కీమ్‌ స్కూల్ ఫీజులు ప్రభుత్వం వెంటనే విడుదల చేయాలి : ఎంఐఎం అధ్యక్షులు న్యాయవాది మోహీద్ పటేల్

నారాయణఖేడ్‌ : రాష్ట్రవ్యాప్తంగా సుమారు 30 వేల మంది ఎస్సీ, ఎస్టీ విద్యార్థులు చదువుకుంటున్న 200 బెస్ట్ అవైలబుల్ స్కూల్స్‌ (బీఏఎస్‌) పథకం కింద గత మూడు సంవత్సరాలుగా పెండింగ్‌లో ఉన్న రూ 200 కోట్ల ఫీజు బకాయిలను వెంటనే విడుదల చేయాలని నారాయణఖేడ్‌ ఎంఐఎం అధ్యక్షులు న్యాయవాది మోహీద్ పటేల్ ప్రభుత్వాన్ని కోరారు.

తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికీ బీఏఎస్‌ పథకానికి సంబంధించిన ఫీజులను విడుదల చేయకపోవడంతో, పలు పాఠశాలలు విద్యార్థులను తరగతులకు రానివ్వడం లేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. దీని వలన పేద, వెనుకబడిన వర్గాల విద్యార్థులు విద్యను కొనసాగించడంలో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు అని పేర్కొన్నారు.

ఈ సమస్యను సీరియస్‌గా తీసుకొని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క తక్షణ చర్యలు తీసుకొని ఎస్సీ, ఎస్టీ విద్యార్థుల భవిష్యత్తును రక్షించాలి అని న్యాయవాది మోహీద్ పటేల్ విజ్ఞప్తి చేశారు.

అదే సమయంలో, బీఏఎస్‌ పథకం లక్ష్యం – సామాజికంగా వెనుకబడిన వర్గాల పిల్లలకు మంచి విద్య అందించడమేనని గుర్తుచేసి, ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల ఈ పథకం ఆత్మనే దెబ్బతింటోందని ఆయన హెచ్చరించారు. “పేద విద్యార్థుల విద్య హక్కు కోసం మేము ఎల్లప్పుడూ పోరాడుతాము. ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలి” న్యాయవాది మోహీద్ పటేల్

కామెంట్‌లు లేవు

Blogger ఆధారితం.