సదర్ సమ్మేళనానికి ముఖ్యమంత్రిని ఆహ్వానించిన కమిటీ ప్రతినిధులు
హైదరాబాద్ : రాబోయే అక్టోబర్ 19న ఎన్టీఆర్ స్టేడియంలో జరగనున్న శ్రీకృష్ణ సదర్ సమ్మేళనంలో పాల్గొనాలని ముఖ్యమంత్రి శ్రీ ఎ. రేవంత్ రెడ్డి గారిని సదర్ సమ్మేళన్ ఉత్సవ కమిటీ ప్రతినిధులు ఆహ్వానించారు.
డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ తెలంగాణ రాష్ట్ర సచివాలయంలో గురువారం జరిగిన సమావేశంలో కమిటీ ప్రతినిధులు ముఖ్యమంత్రిని కలిసి అధికారిక ఆహ్వాన పత్రాన్ని అందజేశారు.
ఈ సందర్భంగా మంత్రి పొన్నం ప్రభాకర్, ఎంపీ అనిల్‌కుమార్ యాదవ్ తో పాటు సదర్ సమ్మేళన్ ఉత్సవ కమిటీకి చెందిన పలువురు సభ్యులు హాజరయ్యారు. ప్రతినిధులు సమ్మేళన ఏర్పాట్లు, కార్యక్రమ వివరాలను ముఖ్యమంత్రికి వివరించి, ఆయన హాజరుతో ఉత్సవం మరింత ప్రతిష్టాత్మకంగా మారుతుందని తెలిపారు.

Post a Comment