కల్తీ కాలనాగు కల్తీ మందులు, కల్తీ రసాయన ఎరువులతో పంటలు
✍️ రచన: మంజుల పత్తిపాటి
మాజీ ఆలేరు వ్యవసాయ మార్కెట్ కమిటీ డైరెక్టర్,
యాదాద్రి భువనగిరి జిల్లా, తెలంగాణ రాష్ట్రం
📞 9347042218
కల్తీ మందులు, కల్తీ రసాయన ఎరువులతో
పంటలు పండిస్తూ —
కల్తీ కాలనాగును పెంచిపోషిస్తున్నాం.
శకుని ఆకలి కేకలు మరచిపోయామా?
అన్నమే దొరకని ఓ రోజు వస్తుందని
మరచిపోయాం.
ప్రకృతి మాత పచ్చకోకను చించేసి,
అరణ్యాలు మింగేసి —
తెగిన గాలిపటంలా ఆనందాన్ని అనుభవిస్తున్నాం.
ప్లాస్టిక్‌ను ప్రకృతి మాత కడుపులో పడేస్తూ,
పడగ విప్పిన కాలుష్య కాలనాగు క్రింద ఉన్నామని
మరచిపోతున్నాం.
“అన్నం పరబ్రహ్మ స్వరూపం” అని మరచి,
ధనదర్పంతో విందులు, వినోదాల పేరుతో
మిగిలిన అన్నం చెత్త డబ్బాల్లో పడేస్తూ —
వీధి చివర ఆకలితో అలమటిస్తున్న
అనాధలను మరచిపోతున్నాం.
ప్రకృతి మన ఇంటి రేపటి దీపాలను
ఆర్పేయకముందే,
ప్లాస్టిక్ వాడకాన్ని,
కల్తీ రసాయన ఎరువులను పూర్తిగా మానేద్దాం —
చెట్లను నాటి సంరక్షిద్దాం. 🌿

Post a Comment