తాడ్వాయి నేడు మేడారంసమ్మక్క, సారలమ్మ హుండీల లెక్కింపు

 

తాడ్వాయి నేడు మేడారంసమ్మక్క, సారలమ్మ హుండీల లెక్కింపు

ములుగు జిల్లా తాడ్వాయి మండలం మేడారం సమ్మక్క, సారలమ్మ వనదేవతల ఆలయ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన హుండీలను ఈరోజు (బుధవారం) లెక్కించనున్నారు. ఈ మేరకు దేవాదాయ శాఖ అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు.

సమ్మక్క, సారలమ్మ, పగిడిద్దరాజు, గోవిందరాజుల ఆలయాల్లో ఉన్న హుండీలను ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన హుండీ కౌంటింగ్ హాల్లో లెక్కించనున్నారు. లెక్కింపు ప్రక్రియలో రెవెన్యూ అధికారులు, పోలీస్ సిబ్బంది, పూజారులు పాల్గొని పర్యవేక్షణ చేయనున్నారు.

మేడారం జాతర అనంతరం భక్తులు సమర్పించిన నైవేద్యాలు, నగదు, బంగారు, వెండి ఆభరణాల లెక్కింపు సజావుగా సాగేందుకు అధికారులు పకడ్బందీ ఏర్పాట్లు చేసినట్లు సమాచారం.

కామెంట్‌లు లేవు

Blogger ఆధారితం.