ఆధార్ సేవల సవరించిన ఛార్జీల వివరాలు ప్రతి కేంద్రంలో స్పష్టంగా ప్రదర్శించాలి : జిల్లా కలెక్టర్
భద్రాద్రి కొత్తగూడెం, అక్టోబర్ 5 : భారత విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ (UIDAI) ఆధార్ సేవలపై సవరించిన కొత్త రుసుములు అక్టోబర్ 1వ తేదీ నుండి దేశవ్యాప్తంగా అమల్లోకి వచ్చాయని జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్ తెలిపారు.
ప్రజలకు ఈ మార్పులపై పూర్తి అవగాహన కల్పించే ఉద్దేశంతో, జిల్లాలోని ప్రతి ఆధార్ సేవా కేంద్రం కొత్త రుసుముల వివరాలను స్పష్టంగా ప్రదర్శించాలనీ ఆయన ఆదేశించారు.
కలెక్టర్ వివరించిన ప్రకారం —
- బయోమెట్రిక్ అప్‌డేట్ (ఫింగర్ ప్రింట్, ఐరిస్, ఫోటో) విషయంలో 5–7 ఏళ్ల పిల్లలకు ఒకసారి ఉచితం, 15–17 ఏళ్ల వయసు గలవారికి కూడా ఒకసారి ఉచితం.మిగతా సందర్భాల్లో రూ.125 వసూలు చేయబడుతుంది.
- డెమోగ్రాఫిక్ అప్‌డేట్ (పేరు, లింగం, జన్మతేదీ, చిరునామా, మొబైల్, ఇమెయిల్ మొదలైనవి) బయోమెట్రిక్ అప్‌డేట్‌తో కలిపి చేస్తే ఉచితం, వేరుగా చేస్తే రూ.75 చెల్లించాలి.
- డాక్యుమెంట్ అప్‌డేట్ (ID లేదా చిరునామా రుజువులు) myAadhaar పోర్టల్ ద్వారా చేస్తే ఉచితం, ఎన్‌రోల్మెంట్ సెంటర్ ద్వారా చేస్తే రూ.75.
- హోమ్ ఎన్‌రోల్మెంట్ సర్వీస్ కోసం మొదటి వ్యక్తికి రూ.700, అదే చిరునామాకు చెందిన ఇతరులకు ఒక్కొక్కరికి రూ.350 చెల్లించాలి.
- ఆధార్ ప్రింట్ లేదా డౌన్‌లోడ్ సేవ కోసం రూ.40 వసూలు చేయబడుతుంది.
జిల్లా ప్రజలు ఆధార్ సంబంధిత సేవల కోసం కేవలం అధికారిక ఆధార్ సేవా కేంద్రాలు లేదా గుర్తింపు పొందిన సెంటర్లను మాత్రమే వినియోగించుకోవాలని, అలాగే సవరించిన రుసుములపై ఎటువంటి అపోహలు లేకుండా విస్తృత ప్రచారం చేయాలని సంబంధిత అధికారులను కలెక్టర్ ఆదేశించారు.
Post a Comment