హైదరాబాద్‌లో ముఖ్య నాయకులను మర్యాదపూర్వకంగా కలసిన దిశ వ్యవస్థాపక అధ్యక్షులు

 

హైదరాబాద్‌లో ముఖ్య నాయకులను మర్యాదపూర్వకంగా కలసిన దిశ వ్యవస్థాపక అధ్యక్షులు

హైదరాబాద్‌, అక్టోబర్‌ 10 : అంబర్‌పేట్‌ నియోజకవర్గ ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్‌, అంబర్‌పేట్‌ పోలీస్‌ స్టేషన్‌లో సీఐ కిరణ్‌కుమార్‌, మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంలో భారతీయ జనతా పార్టీ, పార్లమెంట్‌ సభ్యులు మరియు బీసీ రాష్ట్ర అధ్యక్షులు ఆర్‌. కృష్ణయ్య లను కలసిన దిశా ఉమెన్‌ ప్రొటెక్షన్‌ వ్యవస్థాపక అధ్యక్షురాలు వాసర్ల నాగమణి.

ఈ సందర్భంగా దిశా ఉమెన్‌ ప్రొటెక్షన్‌ వ్యవస్థాపక అధ్యక్షురాలు వాసర్ల నాగమణి మరియు దిశా కుటుంబ సభ్యులు వారిని మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. మహిళా భద్రత, సామాజిక సేవా కార్యక్రమాలు, బీసీ అభివృద్ధి, మరియు మహిళా సమస్యలపై చర్చలు జరిగినట్లు సమాచారం.

దిశా సంస్థ మహిళల రక్షణ, న్యాయ సహాయం, మరియు అవగాహన కార్యక్రమాల్లో కీలక పాత్ర పోషిస్తోందని వాసర్ల నాగమణి తెలిపారు. ఈ సమావేశం సానుకూల వాతావరణంలో సాగిందని, భవిష్యత్తులో మహిళల భద్రతా చర్యల్లో ప్రజాప్రతినిధులు, పోలీస్‌ శాఖ, మరియు సామాజిక సంస్థల మధ్య సమన్వయం మరింత బలోపేతం అవుతుందని నాయకులు ఆశాభావం వ్యక్తం చేశారు.

ఈ కార్యక్రమంలో దిశా సభ్యులతో పాటు స్థానిక నాయకులు, మహిళా సంఘాల ప్రతినిధులు మరియు సామాజిక కార్యకర్తలు పాల్గొన్నారు.

కామెంట్‌లు లేవు

Blogger ఆధారితం.