ఉమ్మడి జిల్లాల్లో రవాణా శాఖ చెక్ పోస్టులపై ఏసీబీ దాడులు – పట్టుబడ్డ నగదు!
భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం జిల్లాల్లో రవాణా శాఖ చెక్‌పోస్టులపై ఏసీబీ బృందాలు ఆకస్మిక తనిఖీలు నిర్వహించాయి. ఏసీబీ డీఎస్‌పీ వై. రమేష్ ఆధ్వర్యంలో శనివారం అర్ధరాత్రి నుంచి ఈ దాడులు కొనసాగుతున్నాయి.
అశ్వారావుపేట, పాల్వంచ, ముత్తగూడెం చెక్‌పోస్టుల్లో ఏసీబీ అధికారులు సడన్ రైడ్లు నిర్వహించి, లెక్కల్లో లేనిపని అనధికార నగదు సీజ్ చేశారు.
ప్రభుత్వం ఇప్పటికే చెక్‌పోస్టులను రద్దు చేసిన నేపథ్యంలో ఇవి ఇంకా కొనసాగుతుండటం పట్ల అధికారులు సీరియస్‌గా వ్యవహరిస్తున్నారు. మరిన్ని వివరాలు త్వరలో వెల్లడించనున్నారు.

Post a Comment