30 వేలు లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన ఏఈ అమర్ సింగ్
రంగారెడ్డి జిల్లా: రాజేంద్రనగర్ సర్కిల్ పరిధిలోని హిమాయత్‌సాగర్ సెక్షన్‌లో గల గంధంగూడ సబ్‌స్టేషన్‌లో పనిచేస్తున్న సహాయక ఇంజనీరు అమర్ సింగ్ అవినీతికి పాల్పడ్డాడు. ఎ.ఆర్.సి.కె. ప్రాజెక్ట్స్ అపార్ట్‌మెంట్‌లో కొత్త ట్రాన్స్‌ఫార్మర్ ఏర్పాటు చేయడానికి ఫిర్యాదుదారుని నుండి ₹30,000 లంచం తీసుకుంటూ తెలంగాణ అనిశా (ACB) అధికారుల చేతికి చిక్కాడు.
అధికారులు నిందితుడిని అదుపులోకి తీసుకుని విచారణ జరుపుతున్నారు.
🔹 ప్రజలకు విజ్ఞప్తి:
ఏ ప్రభుత్వ ఉద్యోగి లంచం అడిగినా, వెంటనే టోల్ ఫ్రీ నంబర్ 1064కు కాల్ చేయండి.
అలాగే
- WhatsApp: 9440446106
- Facebook: Telangana ACB
- X (Twitter): @TelanganaACB
- Website: acb.telangana.gov.in
📢 ఫిర్యాదుదారుల వివరాలు గోప్యంగా ఉంచబడతాయి.

Post a Comment