👇 🌧️ తెలంగాణలో మరో రెండు రోజులు భారీ వర్షాలు!

👇  🌧️ తెలంగాణలో మరో రెండు రోజులు భారీ వర్షాలు!

హైదరాబాద్లో వాతావరణ కేంద్రం హెచ్చరిక

హైదరాబాద్‌: తెలంగాణలో మరో రెండు రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం (IMD Hyderabad) హెచ్చరించింది.

శుక్రవారం ఖమ్మం, వికారాబాద్, సూర్యాపేట, మహబూబ్‌నగర్, కామారెడ్డి, సిద్దిపేట్, మహబూబ్‌నగర్, నాగర్‌కర్నూల్‌, వనపర్తి, నారాయణపేట, జోగులాంబ గద్వాల జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది.

ఈ రోజు కూడా రాష్ట్రంలోని పలు జిల్లాల్లో కుండపోత వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ అధికారులు తెలిపారు.
నాగర్‌కర్నూల్‌, నల్గొండ, సూర్యాపేట్, ఖమ్మం, మహబూబాబాద్, భద్రాద్రి కొత్తగూడెం, మహబూబ్‌నగర్, వనపర్తి, గద్వాల్, నారాయణపేట, రంగారెడ్డి, వికారాబాద్, యాదాద్రి భువనగిరి, జనగాం, ములుగు, వరంగల్, భూపాలపల్లి జిల్లాల్లో అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అంచనా వేశారు.

ఇక మెదక్, సిద్దిపేట్, సంగారెడ్డి, సిరిసిల్ల, కరీంనగర్, హన్మకొండ, నిర్మల్, నిజామాబాద్, కామారెడ్డి, మంచిర్యాల, పెద్దపల్లి, జగిత్యాల జిల్లాల్లో తేలికపాటి నుండి మధ్యస్థంగా వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టు తెలిపారు.

హైదరాబాద్‌లో మధ్యాహ్నం లేదా రాత్రి సమయంలో ఒకటి రెండు సార్లు వర్షం కురిసే అవకాశం ఉందని పేర్కొన్నారు.

అదేవిధంగా కొత్తగూడెం, వరంగల్, హన్మకొండ, జనగాం, భువనగిరి, రంగారెడ్డి, హైదరాబాద్‌, మేడ్చల్‌–మల్కాజ్‌గిరి జిల్లాల్లో ఈదురుగాలులు, ఉరుములు, మెరుపులతో కూడిన వానలు పడే అవకాశం ఉందని తెలిపింది.

వాతావరణ శాఖ తెలిపిన ప్రకారం, శనివారం వారం వరకు పలు జిల్లాల్లో వర్షాలు కొనసాగనున్నాయని అంచనా.


కామెంట్‌లు లేవు

Blogger ఆధారితం.