సెక్స్‌ రాకెట్‌ భగ్నం నిర్వాహకుడితోపాటు ఏడుగురు విటుల అరెస్ట్‌ ముగ్గురు యువతుల రక్షణ

సెక్స్‌ రాకెట్‌ భగ్నం నిర్వాహకుడితోపాటు ఏడుగురు విటుల అరెస్ట్‌ ముగ్గురు యువతుల రక్షణ


హైదరాబాద్‌, అక్టోబర్‌ 24: బంజారాహిల్స్‌లో మరో సెక్స్‌రాకెట్‌ కార్యకలాపాలను టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు భగ్నం చేశారు. రోడ్‌ నంబర్‌–12లోని ఆర్‌ఇన్‌ హోటల్‌లో ఈ రాకెట్‌ నడుస్తోందని గూఢచారి సమాచారం మేరకు గురువారం వెస్ట్‌ జోన్‌ టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు దాడి చేశారు.

దాడిలో నిర్వాహకుడు ఎండీ షరీఫ్‌‌తో పాటు కర్నూల్‌కు చెందిన ఏడుగురు విటులను పోలీసులు అరెస్ట్‌ చేశారు. అలాగే, వ్యభిచారంలో బలవంతంగా నిమగ్నం చేయబడ్డ ముగ్గురు యువతులను రక్షించారు. వారిలో ఒకరు ఉజ్బెకిస్తాన్‌కు చెందిన విదేశీ యువతిగా పోలీసులు గుర్తించారు.

రక్షించిన మహిళలను బంజారాహిల్స్‌ పోలీస్‌స్టేషన్‌కు తరలించి తదుపరి చర్యలు చేపట్టారు. పోలీసుల ప్రాథమిక విచారణలో, గతంలో స్టైల్స్‌ మేకర్‌ సెలూన్‌ నడిపిన షరీఫ్‌ మంచి జీతం, కమీషన్‌లు ఇస్తామని మోసం చేసి యువతులను ఈ వ్యభిచార రాకెట్‌లోకి దింపినట్లు తేలింది.

ఈ ఆపరేషన్‌ను అడిషనల్‌ డిప్యూటీ కమిషనర్‌ ఇక్బాల్‌ సిద్ధిఖి పర్యవేక్షించగా, వెస్ట్‌జోన్‌ టాస్క్‌ఫోర్స్‌ ఇన్‌స్పెక్టర్‌ యాదేందర్‌, ఎస్‌ఐ రవిరాజ్‌ బృందం దాడిలో పాల్గొన్నారు.

కామెంట్‌లు లేవు

Blogger ఆధారితం.