వక్ఫ్‌ భూమిలో అక్రమ నిర్మాణాలను అడ్డుకున్న ఎంఐఎం అధ్యక్షులు మోహీద్‌ పటేల్‌

 

వక్ఫ్‌ భూమిలో అక్రమ నిర్మాణాలను అడ్డుకున్న ఎంఐఎం అధ్యక్షులు మోహీద్‌ పటేల్‌

నారాయణఖెడ్‌ మునిసిపాలిటీ పరిధిలోని పాత సువర్ణ థియేటర్‌ వెనుక ఉన్న దర్గా హజ్రత్‌ బయజీద్‌ హైద్రీకు చెందిన వక్ఫ్‌ భూమిలో కొందరు వ్యక్తులు అక్రమంగా షెడ్లు నిర్మించేందుకు ప్రయత్నించిన ఘటన చోటుచేసుకుంది. జేసీబీల సాయంతో నిర్మాణ పనులు జరుగుతున్నట్లు సమాచారం అందిన వెంటనే ఎంఐఎం నారాయణఖెడ్‌ అధ్యక్షులు, న్యాయవాది మోహీద్‌ పటేల్‌ అక్కడికి చేరుకొని పరిస్థితిని పరిశీలించారు.

తదుపరి ఆయన నారాయణఖెడ్‌ సబ్‌ కలెక్టర్‌, పోలీస్‌ అధికారులతో మాట్లాడి వెంటనే నిర్మాణాలను నిలిపివేయించారు. ఈ సందర్భంగా మోహీద్‌ పటేల్‌ మాట్లాడుతూ, “వక్ఫ్‌ భూములపై అక్రమ ఆక్రమణలకు పాల్పడిన వారిపై చట్టపరమైన చర్యలు తప్పవు. వక్ఫ్‌ ఆస్తుల రక్షణ కోసం కఠినంగా వ్యవహరిస్తాం,” అని హెచ్చరించారు.

ఈ కార్యక్రమంలో ఎంఐఎం నాయకులు మజహర్‌, NMC కమిటీ అధ్యక్షుడు అషూ ఖతీబ్‌, మిస్బా తదితరులు పాల్గొన్నారు.

కామెంట్‌లు లేవు

Blogger ఆధారితం.