సీజేఐ భూషణ్ గవాయ్‌పై దాడి యత్నాన్ని ఖండించిన ఎస్సీ, ఎస్టీ విద్యుత్ ఉద్యోగ సంఘాలు

సీజేఐ భూషణ్ గవాయ్‌పై దాడి యత్నాన్ని ఖండించిన ఎస్సీ, ఎస్టీ విద్యుత్ ఉద్యోగ సంఘాలు

భద్రాద్రి కొత్తగూడె, అక్టోబర్ 08: భారత సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ భూషణ్ రామకృష్ణ గవాయ్పై జరిగిన దాడి యత్నాన్ని తెలంగాణ ఎస్సీ, ఎస్టీ విద్యుత్ ఉద్యోగ సంఘాల జేఏసీ తీవ్రంగా ఖండించింది.

కేటీపీపీ ప్రధాన ముఖద్వారం అంబేద్కర్ విగ్రహం వద్ద జేఏసీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ, “ఈ దాడి దేశ న్యాయ వ్యవస్థ చరిత్రలో ఒక చీకటి రోజుగా నిలిచిపోతుంది. ఇది కేవలం ఒక వ్యక్తిపై దాడి కాదు, భారత రాజ్యాంగం మరియు ప్రజాస్వామ్యంపై దాడి” అని వ్యాఖ్యానించారు.

దాడికి పాల్పడిన వారికి తగిన కఠిన శిక్ష విధించాలని వారు డిమాండ్ చేశారు. నాయకులు మాట్లాడుతూ, “సనాతన ధర్మం పిచ్చి ఎంత ముదిరిందంటే, ఒక దళితుడు అయిన సీజేఐ గవాయ్‌పై బూటు విసిరే స్థాయికి చేరింది. దీనిని దేశంలోని అన్ని ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలు తీవ్రంగా ఖండించాలని” పిలుపునిచ్చారు.

ఈ కార్యక్రమంలో ఎస్సీ, ఎస్టీ జేఏసీ నాయకులు మరియు పలువురు విద్యుత్ శాఖ ఉద్యోగులు పాల్గొన్నారు.

కామెంట్‌లు లేవు

Blogger ఆధారితం.