సీసీ కెమెరాలను ప్రారంభించిన తూప్రాన్ డీఎస్పీ నరేందర్ గౌడ్

సీసీ కెమెరాలను ప్రారంభించిన తూప్రాన్ డీఎస్పీ నరేందర్ గౌడ్


తూప్రాన్, మెదక్ జిల్లా — అక్టోబర్ 27: తూప్రాన్ మండలం వెంకటాయపల్లి గ్రామంలో ఏర్పాటు చేసిన 12 సీసీ కెమెరాలను తూప్రాన్ డీఎస్పీ నరేందర్ గౌడ్ సోమవారం ప్రారంభించారు.

ఈ సందర్భంగా డీఎస్పీ మాట్లాడుతూ, “గ్రామంలో నిఘా కెమెరాలు ఏర్పాటు చేయడం అభినందనీయమైన విషయం. ఇవి గ్రామ భద్రతకు, అసాంఘిక కార్యకలాపాల నియంత్రణకు ఎంతో మేలు చేస్తాయి. యువత మంచి మార్గంలో నడవాలి,” అని సూచించారు.

ఈ కార్యక్రమంలో తూప్రాన్ సీఐ రంగకృష్ణ, ఎస్సై శివానందం, ప్రజాప్రతినిధులు, గ్రామస్థులు, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.

కామెంట్‌లు లేవు

Blogger ఆధారితం.