వలపు వలలో ఎనిమిది లక్షల స్వాహా..!గొంతు మార్చి ప్రజలను మోసం చేసిన ఘరానా ముఠా అరెస్ట్

వలపు వలలో ఎనిమిది లక్షల స్వాహా..!గొంతు మార్చి ప్రజలను మోసం చేసిన ఘరానా ముఠా అరెస్ట్


ఆదిలాబాద్ జిల్లా, అక్టోబర్ 27: అమ్మాయిల గొంతుతో మాట్లాడి ప్రజలను బురిడీ కొట్టిస్తున్న ఘరానా సైబర్ ముఠాను ఆదిలాబాద్ జిల్లా పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ ఘటన సైబర్ నేరాల విభాగం చాకచక్యాన్ని మరోసారి చాటింది.

డీఎస్పీ ఎల్. జీవన్ రెడ్డి వివరాల ప్రకారం — ఆదిలాబాద్ పట్టణానికి చెందిన ఎం. లక్ష్మీకాంత్ అనే వ్యక్తి ఫిర్యాదు మేరకు అక్టోబర్ 25న ఆదిలాబాద్ వన్‌టౌన్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు చేశారు.

దర్యాప్తు చేపట్టిన సైబర్ సెల్ అధికారులు సాంకేతిక ఆధారాలు సేకరించి, కేవలం రెండు రోజుల్లోనే ముఠా జాడను కనుగొని నల్గొండ జిల్లాలో ముగ్గురిని అరెస్ట్ చేశారు.

అరెస్టయిన నిందితులు:
1️⃣ మాలోత్ మంజి @ కృష్ణవేణి (21) s/o బాలు, రామచంద్రపురం తండా, మఠంపల్లి మండలం, సూర్యాపేట జిల్లా
2️⃣ బుక్య గణేష్ (19) s/o శ్రీను, అదే తండా, మఠంపల్లి మండలం
3️⃣ రూపవత్ శ్రావణ్ కుమార్ (18) s/o శంకర్, అదే తండా

నిందితుల వద్ద నుండి రూ.1.5 లక్షల నగదు, మూడు మొబైల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు.

సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌ల ద్వారా పరిచయం పెంచుకుని, అమ్మాయిల గొంతుతో మాట్లాడి విశ్వాసం కలిగించి, తరువాత డబ్బులు వసూలు చేసే విధంగా ఈ ముఠా మోసాలు చేసిందని పోలీసులు పేర్కొన్నారు. సైబర్ నేరాల పట్ల అప్రమత్తంగా ఉండాలని, అనుమానాస్పద కాల్స్ లేదా మెసేజ్‌లకు స్పందించకూడదని ప్రజలకు డీఎస్పీ హెచ్చరిక జారీ చేశారు.


కామెంట్‌లు లేవు

Blogger ఆధారితం.