స్టేషన్ ఘనపూర్లో గడ్డి మందు తాగి ప్రేమజంట ఆత్మహత్యాయత్నం!
జనగామ జిల్లా అక్టోబర్ 07: జనగామ జిల్లా స్టేషన్ ఘనపూర్ మండలం తాటికొండ గ్రామంలో విషాదం చోటుచేసుకుంది. ప్రేమలో పడ్డ యువజంట ఆత్మహత్యాయత్నానికి పాల్పడి గ్రామంలో కలకలం రేపింది. సమాచారం ప్రకారం, మారపాక అన్వేష్ (26), గడ్డం పావని (22) అనే యువకుడు–యువతి ప్రేమలో ఉన్నారు. అయితే, ఇరు కుటుంబాల అంగీకారం లభించకపోవడంతో నిరాశ చెందిన వారు మంగళవారం ఉదయం గడ్డి మందు తాగి ఆత్మహత్యాయత్నం చేసినట్లు పోలీసులు తెలిపారు.
స్థానికులు వారిని గుర్తించి వెంటనే ఆస్పత్రికి తరలించారు. అయితే ప్రియుడు అన్వేష్ చికిత్స పొందుతూ మృతి చెందాడు. ప్రియురాలు పావని వరంగల్ ఎంజీఎం ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. ఆమె పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు వెల్లడించారు.
ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఆత్మహత్యకు గల అసలు కారణాలు ఇంకా తెలియాల్సి ఉంది. గ్రామంలో ఒక్కసారిగా విషాద ఛాయలు అలుముకున్నాయి.

Post a Comment