ఏలూరు జిల్లాలో ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు బోల్తా! 13 మందికి గాయాలు
ఏలూరు జిల్లా, నవంబర్ 4: నిన్న కర్నూలు, నేడు చేవెళ్ల బస్సు ప్రమాదాల విషాదం మరవకముందే, ఏలూరు వద్ద మరో రోడ్డు ప్రమాదం సంభవించింది. మంగళవారం ఉదయం ఏలూరు నుండి హైదరాబాద్ వెళ్తున్న భారతి ట్రావెల్స్ బస్సు, ఏలూరు జిల్లా లింగంపాలెం మండలం జూబ్లీనగర్ సమీపంలో అదుపు తప్పి బోల్తా పడింది.
ఈ ప్రమాదంలో ఇద్దరు ప్రయాణికులు మృతి చెందగా, మరో 13 మంది గాయపడ్డారు. క్షతగాత్రులను సమీపంలోని ఆసుపత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు. ప్రమాదం జరిగిన సమయంలో బస్సులో సుమారు 50 మంది ప్రయాణికులు ఉన్నట్లు సమాచారం.
వార్త తెలుసుకున్న వెంటనే అధికారులు, పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. ఈ ప్రమాదానికి గల కారణాలు ఇంకా తెలియాల్సి ఉంది.

Post a Comment