కొత్తగూడెం స్పెషల్ లోక్ అదాలత్ 1,604 కేసులు పరిష్కారం

కొత్తగూడెం స్పెషల్ లోక్ అదాలత్ 1,604 కేసులు పరిష్కారం జిల్లా జడ్జి & చైర్మన్ పాటిల్ వసంత్


కొత్తగూడెం, నవంబర్ 15 (లీగల్ న్యూస్): భద్రాద్రి కొత్తగూడెం జిల్లా వ్యాప్తంగా శనివారం నిర్వహించిన స్పెషల్ లోక్ అదాలత్ ఘన విజయాన్ని సాధించింది. ఒకే రోజు జిల్లాలో మొత్తం 1,604 కేసులు పరిష్కారం కావడంతో న్యాయ సేవలలో మరో ముందడుగు పడింది.

జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో జరిగిన ఈ లోక్ అదాలత్‌లో పౌర, క్రిమినల్, బ్యాంకింగ్, ఫ్యామిలీ, ట్రాఫిక్ తదితర విభాగాలకు చెందిన అనేక కేసులను సర్దుబాటు పద్ధతిలో విచారించి తక్షణ పరిష్కారాలు అందించారు. ప్రజల సమయం, ధనం ఆదా అవడంతో పాటు పరస్పర రాజీదారిత్యంతో కేసుల పరిష్కారం కావడం ఈ కార్యక్రమానికి విశేష స్పందనను తెచ్చిపెట్టింది.

జిల్లా న్యాయ సేవాధికార సంస్థ చైర్మన్ పాటిల్ వసంత్ కార్యక్రమాన్ని పర్యవేక్షించారు. ప్రజలకు అందుబాటులో న్యాయం అందించడమే లోక్ అదాలత్‌ల ప్రధాన లక్ష్యమని ఆయన తెలిపారు. పెద్ద ఎత్తున కేసులు ఒకేరోజు పరిష్కారం కావడం న్యాయ వ్యవస్థపై ప్రజల్లో నమ్మకం పెంచే అంశమని పేర్కొన్నారు.

అధికారులు, అడ్వకేట్లు, పోలీసులు సహకారంతో లోక్ అదాలత్‌ను విజయవంతంగా నిర్వహించినందుకు సంబంధిత విభాగాలకు న్యాయ సేవాధికార సంస్థ ధన్యవాదాలు తెలిపింది.

కామెంట్‌లు లేవు

Blogger ఆధారితం.