ఓపెన్‌కాస్ట్‌ గని–1 నుంచి బదిలీ పై వెల్లుతున్న రాజశేఖర్‌కు వీడ్కోలు

ఓపెన్‌కాస్ట్‌ గని–1 నుంచి బదిలీ పై వెల్లుతున్న రాజశేఖర్‌కు వీడ్కోలు


కొత్త ప్రాజెక్ట్ ఆఫీసర్ ప్రవీణ్‌కు HMS నాయకుల ఘన స్వాగతం

మంథని ః ఓపెన్‌కాస్ట్‌ గని–1లో ప్రాజెక్ట్ ఆఫీసర్‌గా పనిచేసి, ఇటీవల ఓపెన్‌కాస్ట్‌–2కు బదిలీపై వెళ్తున్న అధికారి రాజశేఖర్‌కు శుక్రవారం సాయంత్రం ఘనంగా వీడ్కోలు కార్యక్రమం నిర్వహించారు. అదే వేళ కొత్తగా OC–1 ప్రాజెక్ట్ ఆఫీసర్‌గా బాధ్యతలు స్వీకరించిన ప్రవీణ్‌ను HMS నాయకులు సాదరంగా ఆహ్వానించారు.

కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన HMS కేంద్ర కార్యదర్శి కామ్రేడ్ ఖాజీ మహమ్మద్ ఇస్మాయిల్ నిజామీ, రాజశేఖర్‌కు శుభాకాంక్షలు తెలియజేస్తూ బొకే, షాల్‌, మెమెంటోలు అందజేశారు. ఆయన మాట్లాడుతూ… రాజశేఖర్‌ OC–1లో పనిచేసిన కాలంలో ఉద్యోగుల సమస్యలను పరిష్కరించడంలో చక్కటి సమన్వయం చూపారని ప్రశంసించారు. అదే విధంగా కొత్త ప్రాజెక్ట్ ఆఫీసర్ ప్రవీణ్‌ నాయకత్వంలో మరింత అభివృద్ధి జరగాలని ఆకాంక్షించారు.

కార్యక్రమంలో ప్రాజెక్ట్‌ సెక్రటరీ కామ్రేడ్ మల్లా రెడ్డి, పిట్ కార్యదర్శి కామ్రేడ్ సానా శ్రీనివాస్, సహాయ కార్యదర్శి కామ్రేడ్ సాంగి రవి తదితర HMS నాయకులు పాల్గొని నూతన అధికారి ప్రవీణ్‌కు హృదయపూర్వక స్వాగతం తెలిపారు.

వీడ్కోలు–స్వాగత కార్యక్రమంలో గని ఉద్యోగులు కూడా పాల్గొని రాజశేఖర్ సేవలను కొనియాడారు. కొత్త ప్రాజెక్ట్ ఆఫీసర్ ప్రవీణ్‌తో కలిసి పని చేయడానికి తాము సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు.

కామెంట్‌లు లేవు

Blogger ఆధారితం.