సూక్మా జిల్లాలో తుపాకుల మోత… భారీ ఎన్‌కౌంటర్ ముగ్గురు మావోయిస్టులు మృతి

సూక్మా జిల్లాలో తుపాకుల మోత… భారీ ఎన్‌కౌంటర్ ముగ్గురు మావోయిస్టులు మృతి


చత్తీస్గడ్‌ నవంబర్ 16: చత్తీస్గడ్‌లో మావోయిస్టులపై భద్రతా దళాలు మరోసారి దాడి బిగించాయి. సుక్మా జిల్లాలో ఆదివారం ఉదయం మావోయిస్టులు – భద్రతా బలగాల మధ్య భారీ స్థాయిలో ఎన్‌కౌంటర్ చోటుచేసుకుంది. ఈ ఎదురుకాల్పుల్లో ఇప్పటివరకు ముగ్గురు మావోయిస్టులు మృతి చెందినట్లు సమాచారం. ఇంకా మరికొందరు మావోయిస్టులు దాడిలో చిక్కి ఉండొచ్చన్న అనుమానంతో పోలీసులు ఆ ప్రాంతాన్ని ముట్టడి చేశారు.

లభించిన వివరాల ప్రకారం సుక్మా జిల్లా చింతగుఫా పోలీస్‌ స్టేషన్ పరిధిలోని కరిగుండం అటవీ ప్రాంతంలో పోలీసుల కూంబింగ్ ఆపరేషన్ కొనసాగుతుండగా మావోయిస్టుల సమూహం కాల్పులకు తెగబడ్డారు. దీంతో ఇద్దరు వైపులా గంటల పాటు కాల్పులు కొనసాగాయని సమాచారం.

ఎన్‌కౌంటర్ ముగిసిన తర్వాత సంఘటన స్థలాన్ని పరిశీలించిన పోలీసులు పలు తుపాకులు, పేలుడు పదార్థాలు, మావోయిస్టుల సామగ్రిను స్వాధీనం చేసుకున్నారు. మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉందని, అడవి ప్రాంతంలో శోధనలు కొనసాగుతున్నాయని పోలీసులు వెల్లడించారు.

సుక్మా–బీజాపూర్ అటవీ మండలాల్లో ఇటీవల మావోయిస్టుల కదలికలు పెరగడంతో భద్రతా దళాలు అప్రమత్తంగా కూంబింగ్ నిర్వహిస్తున్నాయి.

కామెంట్‌లు లేవు

Blogger ఆధారితం.