AIMIM అధినేత అసదుద్దీన్ ఓవైసీని మర్యాదపూర్వకంగా కలిసిన జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే నవీన్ యాదవ్
హైదరాబాద్: జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో విజయం సాధించిన ఎమ్మెల్యే నవీన్ యాదవ్, AIMIM పార్టీ అధ్యక్షుడు, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీని మంగళవారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఉప ఎన్నికల్లో AIMIM ప్రకటించిన పూర్తి స్థాయి మద్దతుకు తన హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తూ ఓవైసీకి పుష్పగుచ్ఛం అందించారు.
ఈ సందర్బంగా ఎమ్మెల్యే నవీన్ యాదవ్ మాట్లాడుతూ, AIMIM పార్టీ తమ విజయంలో కీలక పాత్ర పోషించిందని, ముఖ్యంగా ఉప ఎన్నికల సమయంలో పార్టీ కేడర్ చేసిన కఠినమైన శ్రమను తాను ఎప్పటికీ మరవనని పేర్కొన్నారు. రాజకీయ విభజనలను పక్కనబెట్టి, అభివృద్ధి లక్ష్యంగా జూబ్లీహిల్స్ ప్రజల సేవ కోసం కలిసి పనిచేస్తామని తెలిపారు.
ఓవైసీ కూడా నవీన్ యాదవ్‌కు శుభాకాంక్షలు తెలియజేస్తూ, ప్రజల అభ్యున్నతి కోసం AIMIM ఎప్పుడూ నిర్మాణాత్మక రాజకీయాలకు కట్టుబడి ఉంటుందని వెల్లడించారు.

Post a Comment