ఓసీపి–1లోని వివిధ డిపార్ట్‌మెెంట్లలో కార్మికులు నల్ల రిబ్బన్లు ధరించి నిరసన
ఓసీపి-1, రామగుండం -3 ఏరియా: ఓసీపి–1లో హెచ్‌ఎమ్‌ఎస్ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం ఘనంగా జరిగింది. హెచ్‌ఎమ్‌ఎస్ కేంద్ర కార్యదర్శి కామ్రేడ్ ఖాజీ మహమ్మద్ ఇస్మాయిల్ నిజామీ ప్రధాన అతిథిగా హాజరై కార్మికులను ఉద్దేశించి మాట్లాడారు.
అయితే ఈ ముట్టడిలో పాల్గొన్న కార్మిక సంఘాల నాయకులను పోలీసులు స్టేషన్లలో నిర్బంధించడం పట్ల హెచ్‌ఎమ్‌ఎస్ తీవ్రంగా అభ్యంతరం వ్యక్తం చేసింది. దానికి నిరసనగా ఈ రోజు రామగుండం-3 ఏరియా ఓసీపి–1లోని వివిధ డిపార్ట్‌మెెంట్లలో కార్మికులు నల్ల రిబ్బన్లు ధరించి నిరసన తెలిపారు.
ఈ కార్యక్రమంలో ఉపాధ్యక్షుడు శాంతి స్వరూప్ ఆధ్వర్యంలో, ఎ.ఎల్.పి. పిట్ సెక్రటరీ రాజశేఖర్, డంపర్ మరియు డ్రిల్ ఆపరేటర్లు జహీరుద్దీన్, శ్రీధర్, కె. శ్రీనివాస్, బి. నరేష్, జె. ఇలయ్య, పి. సమ్మయ్య, ఇ. రాయలింగు, బి. సురేందర్, కె. రమేష్, బాలకృష్ణ, జి. నాగరాజు, జబ్బార్ పాషా తదితరులు పాల్గొన్నారు.

Post a Comment