బావ ఇంట్లో బావమరిది కన్నం — నిందితుడు అరెస్ట్

బావ ఇంట్లో బావమరిది కన్నం — నిందితుడు అరెస్ట్


హనుమకొండ రూరల్: బావ ఇంట్లో దొంగతనం చేసిన బావమరిదిని మడికొండ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వాహన తనిఖీల సందర్భంగా అనుమానాస్పదంగా కనిపించిన ఐలవేని సాయి రోహిత్ (26)ను పోలీసులు పట్టుకుని విచారించగా, ఆరు నెలల క్రితం బూతగడ్డకు చెందిన తన బావ సతీష్ ఇంట్లో దొంగతనం చేసినట్లు నిందితుడు ఒప్పుకున్నాడు.

నిందితుడి వద్ద నుంచి రూ.4.36 లక్షల విలువైన 47.05 గ్రాముల బంగారు ఆభరణాలు స్వాధీనం చేసినట్లు సీఐ పుల్యాల కిషన్ తెలిపారు.

కామెంట్‌లు లేవు

Blogger ఆధారితం.