కొమురం భీమ్–ఆసిఫాబాద్‌కు నూతన ఎస్పీగా నిఖితా పంత్
హైదరాబాదు: రాష్ట్ర ప్రభుత్వం తాజా బదిలీలలో భాగంగా 32 మంది ఐపీఎస్ అధికారులను మార్పులు చేసింది. ఈ క్రమంలో కొమురం భీమ్–ఆసిఫాబాద్ జిల్లా పోలీసు సూపరింటెండెంట్‌గా పనిచేస్తున్న కాంతిలాల్ పాటిల్ ఐపీఎస్‌ను బదిలీ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
ఆయన స్థానంలో నిఖితా పంత్‌ను కొత్త జిల్లా ఎస్పీగా నియమించింది. త్వరలోనే ఆమె బాధ్యతలు స్వీకరించనున్నట్లు సమాచారం. తాజా పదవీ మార్పులతో జిల్లాలో పోలీసులు కార్యాచరణలో కొత్త వేగం అందుకుంటారని అధికారులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.

Post a Comment