సాటి మనిషి పట్ల సఖ్యతే నిజమైన భక్తి: షేఖ్ అబ్దుల్ బాసిత్

సాటి మనిషి పట్ల సఖ్యతే నిజమైన భక్తి: షేఖ్ అబ్దుల్ బాసిత్


పెనగడప, నవంబర్ 21: సాటి మనిషి పట్ల సఖ్యతతో వ్యవహరించడమే దేవుని యెడల నిజమైన భక్తి అని జమాతే ఇస్లామి హింద్ సభ్యులు షేఖ్ అబ్దుల్ బాసిత్ పేర్కొన్నారు. జమాతే ఇస్లామి హింద్ దేశవ్యాప్తంగా నవంబర్ 21 నుంచి 30 వరకు నిర్వహిస్తున్న “హం సాయోం కే హుఖుక్ – పొరుగు వారి హక్కులు” కార్యక్రమం లో భాగంగా పెనగడప పంచాయతీలోని మసీదులో ఆయన మాట్లాడారు.

పొరుగు వారితో శాంతియుతంగా జీవించడం, వారి హక్కులను గౌరవించడం ఇస్లాంలో అత్యంత గొప్ప పాఠమని తెలిపారు. “మీ పొరుగు వారు పస్తులు ఉండగా, మీరు కడుపు నిండా తిని నిద్రపోతే మీరు నిజమైన విశ్వాసులు కారు” మరియు“మీ వల్ల మీ పొరుగు వారికి ఇబ్బంది కలిగితే మీరు విశ్వాసులే కాదు” అని ప్రవక్త ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లం) బోధించిన వాక్యాలను ఉదహరించారు.

అతను ఇంకా మాట్లాడుతూ—

  • శాంతియుత సమాజ నిర్మాణానికి పరస్పర క్షమాభావం, చిన్న విషయాలపై పట్టింపులేమీ లేకపోవడం అవసరం
  • బజార్లలో, ముఖ్యంగా పార్కింగ్ సమయంలో పక్కవారికి ఇబ్బంది తలెత్తకుండా వ్యవహరించాలి
  • శుభకార్యాలు, ఇతర కార్యక్రమాల సందర్భాల్లో కూడా శబ్దం, రద్దీ వల్ల ఇతరులకు ఇబ్బంది కలగకుండా చూడాలి
    అని పేర్కొన్నారు.

అందరికీ సృష్టి కర్త దేవుడు ఒక్కడే… కులమతాలకు అతీతంగా మనం ఒకరి పట్ల ఒకరు మంచితనంతో మసలుకోవాలి” అని షేఖ్ అబ్దుల్ బాసిత్ అన్నారు.

ఈ కార్యక్రమంలో జమాతే ఇస్లామి రుద్రంపూర్ శాఖ అధ్యక్షుడు అబ్దుల్ మాజీద్ రబ్బానీ, మసీదు ఇమామ్ మౌలానా అంజద్, మసీదు అధ్యక్షుడు అబ్దుల్ రహీం, మైనారిటీ నాయకులు రహీం ఖురేషీ, ఐఎన్‌టీయూసీ నాయకులు రజాక్, షబ్బీర్, షమీం, జానీబాయ్, అలాగే టీఆర్‌ఎస్ నాయకులు హమీద్, రసూల్ తదితరులు పాల్గొన్నారు.

కామెంట్‌లు లేవు

Blogger ఆధారితం.