ఫార్ములా–ఈ కేసులో నన్ను అరెస్ట్ చేయలేడు: మాజీ మంత్రి కేటీఆర్
హైదరాబాద్: నవంబర్ 21: ఫార్ములా–ఈ కార్ రేసు నిర్వహణలో జరిగిన అక్రమాల కేసులో గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ, మాజీ మంత్రి కేటీఆర్‌పై ప్రాసిక్యూషన్‌కు అనుమతి ఇచ్చిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో కేటీఆర్ స్పందిస్తూ, తాను ఎలాంటి తప్పూ చేయలేదని, చట్టం తన పని తానే చేసుకుంటుందని, అవసరమైతే లై డిటెక్టర్ టెస్ట్‌కు కూడా సిద్ధమేనని తెలిపారు.
“ఇంతకు మించి చెప్పేదేం లేదు. సీఎం రేవంత్ రెడ్డి నన్ను అరెస్టు చేసే ధైర్యం చేయడు, నా అరెస్టు జరగదు. ఆ కేసులో ఏమీ లేదని రేవంత్‌కూ తెలుసు’’ అని శుక్రవారం నిర్వహించిన మీడియా సమావేశంలో కేటీఆర్ వ్యాఖ్యానించారు.
పార్టీ ఫిరాయింపులపై స్పందించిన కేటీఆర్
ఫిరాయింపుల రాజకీయాలపై కేటీఆర్ వ్యాఖ్యానిస్తూ, దానం నాగేందర్‌ను రాజీనామా చేయించి, కడియం శ్రీహరిని రక్షించే ప్రయత్నం జరుగుతోందని ఆరోపించారు. “దానం నాగేందర్ కాంగ్రెస్ గుర్తుపై గెలవకపోవడం వల్ల అనర్హత వేటు పడుతుందనే భయంతో రాజీనామా చేస్తున్నారు. సాంకేతిక సాకులు చూపించి కడియంను కాపాడే ప్రయత్నం చేస్తున్నారు’’ అన్నారు. అంతేకాదు, ఖైరతాబాద్ ఉపఎన్నిక కంటే ముందే GHMC ఎన్నికలు జరిగే అవకాశాలు ఉన్నాయని కేటీఆర్ తెలిపారు.
9,300 ఎకరాల భారీ భూ కుంభకోణం: కేటీఆర్ ఆరోపణలు
హైదరాబాదులో 9,300 ఎకరాల భారీ భూ కుంభకోణం జరిగిందని, ఈ వ్యవహారంలో సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వం నేరుగా ప్రమేయం ఉందని కేటీఆర్ సంచలన ఆరోపణలు చేశారు. “ఇటీవలి కేబినెట్ సమావేశంలో 5 లక్షల కోట్ల విలువైన ఆస్తులను కబ్జా చేసేందుకు తెరలేపారు’’ అని ఆయన వ్యాఖ్యానించారు.

Post a Comment