రోడ్డు ప్రమాదంలో జగిత్యాల జిల్లాకు చెందిన బీటెక్ విద్యార్థి దుర్మరణం
శంషాబాద్, నవంబర్ 20: శంషాబాద్ పోలీస్‌స్టేషన్ పరిధిలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ బీటెక్ విద్యార్థి మృతి చెందిన ఘటన స్థానికంగా విషాదాన్ని మిగిల్చింది.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం—జగిత్యాల జిల్లా ధర్మపురి మండలానికి చెందిన సిద్ధార్థ్ (22) నర్కూడలో నివసిస్తూ వర్ధమాన ఇంజనీరింగ్ కాలేజీలో బీటెక్ చదువుతున్నాడు. మంగళవారం ఉదయం నర్కూడ నుండి కాలేజీకి బైక్‌పై బయలుదేరిన అతడిపై మార్గమధ్యంలో ఒక ఆటో ట్రాలీ వేగంగా వచ్చి ఢీకొట్టింది.
ప్రమాదంలో తీవ్రమైన గాయాలపాలైన సిద్ధార్థ్‌ను వెంటనే ఆసుపత్రికి తరలించినా, చికిత్స పొందుతూ మృతిచెందాడు. ఈ ఘటనపై శంషాబాద్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.

Post a Comment