డాక్టర్ చంటి ముదిరాజ్‌కు “సేవా రత్న అవార్డు 2025” అభినందనలు తెలిపిన పొన్నెకంటి సంజీవరాజు

డాక్టర్ చంటి ముదిరాజ్‌కు “సేవా రత్న అవార్డు 2025”  అభినందనలు తెలిపిన పొన్నెకంటి సంజీవరాజు


భద్రాద్రి కొత్తగూడెం: సమాచార హక్కు చట్టం జాతీయ వ్యవస్థాపక అధ్యక్షులు డాక్టర్ చంటి ముదిరాజ్ ఢిల్లీ నుండి ప్రతిష్ఠాత్మకమైన **“సేవా రత్న అవార్డు 2025”**కు ఎంపిక కావడం గర్వకారణమని సమాచార హక్కు చట్టం సాధన కమిటీ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ప్రధాన కార్యదర్శి పొన్నెకంటి సంజీవరాజు తెలిపారు.

సామాజిక సేవారంగంలో విశేష కృషి చేయడంతో పాటు ప్రజా హక్కుల సాధన కోసం నిరంతరం పోరాడుతూ, సేవా స్పూర్తితో ముందుకు సాగుతున్న డాక్టర్ చంటి ముదిరాజ్ సమాజానికి మార్గదర్శకుడిగా నిలిచారని ఆయన అన్నారు.

ఇలాంటి గౌరవప్రదమైన అవార్డుకు ఎంపిక కావడం ప్రతి తెలంగాణ వాదికి గర్వకారణమని పొన్నెకంటి సంజీవరాజు పేర్కొన్నారు.

కామెంట్‌లు లేవు

Blogger ఆధారితం.