హజరత్ నాగుల్ మీరా దర్గా షరీఫ్ ఉర్సు ఉత్సవాలు

హజరత్ నాగుల్ మీరా దర్గా షరీఫ్ ఉర్సు ఉత్సవాలు


భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, చుంచుపల్లి మండలం: ఎస్సిబి నగర్ మేషన్ కాలనీ గల హజరత్ నాగుల్ మీరా దర్గా షరీఫ్ ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. ఉత్సవాల్లో భక్తుల సందోహం కనిపించింది. దర్గా పరిసరాలు ఆధ్యాత్మిక వాతావరణంతో మార్మోగాయి.

ఈ సందర్భంగా నిర్వాహకులు మాలిక్ శివ, కమిటీ సభ్యులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. రామవరం పంజాబ్ గడ్డ నుండి గందం, గౌస్ ఏ పాక్ నిషానిలు ఒంటెలు, గుర్రాలపై భారీ ఊరేగింపు నిర్వహించి, దర్గాకు తీసుకువచ్చారు. ఈ ఊరేగింపులో భక్తులు ఉత్సాహంగా పాల్గొని "అల్లాహు అక్బర్" నినాదాలతో ప్రాంతమంతా మార్మోగించారు.

ఉత్సవాల సందర్భంగా ప్రత్యేక ప్రార్థనలు, ఫతేహ్ పఠనం నిర్వహించగా, అనంతరం అన్నదాన కార్యక్రమం కూడా జరిగింది. స్థానిక ప్రజాప్రతినిధులు, మత పెద్దలు పాల్గొని హజరత్ నాగుల్ మీరా మహాత్ముని సేవా భావాన్ని స్మరించారు.

కామెంట్‌లు లేవు

Blogger ఆధారితం.