51.9 కిలోల గంజాయి పట్టివేత – కారు, బైకు సీజ్ – రూ.26 లక్షల విలువైన గంజాయి స్వాధీనం

51.9 కిలోల గంజాయి పట్టివేత – కారు, బైకు సీజ్ – రూ.26 లక్షల విలువైన గంజాయి స్వాధీనం


భద్రాద్రి జిల్లా : ఒరిస్సా నుంచి కేరళాకు అక్రమంగా తరలిస్తున్న 51.9 కిలోల గంజాయిని ఖమ్మం ఎక్సైజ్‌ ఎన్ఫోర్స్మెంట్‌ ఎస్సై శ్రీహరి రావు సిబ్బందితో కలిసి భద్రాచలం పరిధిలోని కూనవరం క్రాస్‌ రోడ్ వద్ద పట్టుకున్నారు.

తనిఖీ సమయంలో కారు ఇంజిన్ భాగంలో దాచిన గంజాయి ప్యాకెట్లు కనుగొనగా, వాటిని తూకం వేయగా 51.9 కిలోల గంజాయిగా నిర్ధారించారు. స్వాధీనం చేసిన గంజాయి అంచనా మార్కెట్ విలువ రూ.26 లక్షలుగా అధికారులు తెలిపారు.

ఈ ఆపరేషన్‌లో ఒక కారు, ఒక బైక్‌ను కూడా సీజ్ చేశారు. ఈ కేసులో కేరళకు చెందిన జకారియా పర్యాల్, నసిర పూర్తియా వేట్టల్లను అరెస్ట్ చేశారు. అలాగే సూర్యాపేటకు చెందిన కందుల రవిపై కూడా కేసు నమోదు చేయగా, అతడు పరారీలో ఉన్నట్లు వెల్లడించారు.

అరెస్ట్ చేసిన ఇద్దరిని, స్వాధీనం చేసిన వాహనాలు, గంజాయిని భద్రాచలం ఎక్సైజ్ స్టేషన్ సీఐకి అప్పగించారు.

ఎక్సైజ్‌ ఎన్ఫోర్స్మెంట్‌ డైరెక్టర్ షాన్వాస్ ఖాసీం ఆధ్వర్యంలో కొనసాగుతున్న **“స్పెషల్ డ్రైవ్”**లో భాగంగా ఈ ఆపరేషన్‌ విజయవంతమైందని ఖమ్మం అసిస్టెంట్‌ కమిషనర్ గణేష్ తెలిపారు. ఈ కేసు దర్యాప్తు బాధ్యతను ఏఈఎస్ కరం చంద్‌ చేపట్టనున్నారు. గంజాయి పట్టుకున్న ఎక్సైజ్‌ సిబ్బందిని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ షాన్వాస్ ఖాసీం అభినందించారు.

కామెంట్‌లు లేవు

Blogger ఆధారితం.