డిసెంబర్ 26న ఖమ్మంలో జరిగే సిపిఐ భారీ బహిరంగ సభను జయప్రదం చేయాలి — ఎం. తాజుద్దీన్

డిసెంబర్ 26న ఖమ్మంలో జరిగే సిపిఐ భారీ బహిరంగ సభను జయప్రదం చేయాలి — ఎం. తాజుద్దీన్


సదాశివపేట: డిసెంబర్ 26న ఖమ్మంలో జరగబోయే సిపిఐ భారీ బహిరంగ సభను విజయవంతం చేయాలని పార్టీ శ్రేణులకు సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు ఎం. తాజుద్దీన్ విజ్ఞప్తి చేశారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భారత కమ్యూనిస్టు పార్టీ ఏర్పడి వంద సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో ఈ మహాసభను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. “సిపిఐ పార్టీ భారత స్వాతంత్ర్య సమరంలో కీలక పాత్ర పోషించింది. బ్రిటిష్ పాలనలో అనేక కుట్ర కేసులు ఎదుర్కొన్నప్పటికీ ప్రజల పక్షాన పోరాడి నిలబడ్డది. అలాంటి గౌరవనీయ చరిత్ర కలిగిన పార్టీ శతాబ్దీ మహోత్సవ సభలో మన సదాశివపేట ప్రాంతం నుండి కూడా భారీగా పాల్గొని సభను జయప్రదం చేయాలి” అని ఆయన పిలుపునిచ్చారు.

ఈ కార్యక్రమంలో సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు ఎం.డి. షఫీ, ఏఐటియుసి మండల కార్యదర్శి శంకరప్ప, బీకేఎం యు మునిపల్లి మండల కార్యదర్శి గంగమ్మ, సాధిక్ అలి, బుజ్జమ్మ, వెంకట్ గౌడ్, బీ. పాషా, గౌస్ తదితరులు పాల్గొన్నారు.

కామెంట్‌లు లేవు

Blogger ఆధారితం.