30 వేల లంచం తీసుకుంటూ ACBకి చిక్కిన టెక్మాల్ పోలీస్ స్టేషన్ ఎస్ఐ
మెదక్ జిల్లా టెక్మాల్‌లో అవినీతి సుడిగాలి మళ్లీ దుమారం రేపింది. టెక్మాల్ పోలీస్ స్టేషన్‌లో పనిచేస్తున్న ఎస్ఐ రాజేష్ రూ.30 వేల లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు సోమవారం దాడి చేసి రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు.
సమాచారం అందుకున్న ఏసీబీ బృందం ముందుగా స్టేషన్ పరిసరాలను ముట్టడి చేసింది. లంచం మొత్తాన్ని స్వీకరించిన క్షణాల్లోనే రాజೇಶ್ అక్కడి నుంచి పారిపోవడానికి ప్రయత్నించాడు. వెంటనే అతడిని చేజ్ చేసిన అధికారులు గ్రామ శివారులోని వ్యవసాయ పొలాల వద్ద అతన్ని పట్టుకుని అదుపులోకి తీసుకున్నారు.
ఎస్ఐ అరెస్ట్ విషయమ తెలిసిన గ్రామస్థులు టెక్మాల్‌లో టపాకాయలు కాల్చి సంబరాలు చేసుకున్నారు. స్థానికుల అభిప్రాయం ప్రకారం, గత కొంతకాలంగా ఎస్ఐ అవినీతికి పాల్పడుతున్నాడని, ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి.
ఏసీబీ కేసు నమోదు చేసి, రాజేష్‌ను విచారణ కోసం తీసుకువెళ్లింది. అధికారుల దాడితో పోలీస్ స్టేషన్‌లో కలకలం చెలరేగింది.

Post a Comment