ఉట్నూరు ‘ఆదివాసీల ధర్మయుద్ధం’ మహాసభను విజయవంతం చేయాలని పిలుపు
బెజ్జూర్, కొమురం భీం జిల్లా బెజ్జూర్ మండల కేంద్రంలోని ఆదివాసి భవనంలో మంగళవారం ఆదివాసి సంఘ నాయకులు ‘ఆదివాసీల ధర్మ యుద్ధం’ పోస్టర్‌ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆదివాసీ మండల అధ్యక్షులు కోరేత తిరుపతి మాట్లాడారు.
ఆదివాసీ హక్కుల పరిరక్షణ కోసం అవలంబిస్తున్న పోరాటంలో భాగంగా, “ఆదివాసీ బచావో – లంబాడా హటావో” నినాదంతో, లంబాడా సముదాయాన్ని ఎస్టీ జాబితా నుంచి తొలగించాలని ఒకే డిమాండ్‌తో ఈ మహాసభ ఏర్పాటు చేసినట్టు ఆయన తెలిపారు.
ఈనెల నవంబర్ 23వ తేదీన, ఉట్నూర్ మండల కేంద్రంలోని ఎంపీడీవో గ్రౌండ్ వద్ద 9 తెగల ఆదివాసీ సంఘాల సమన్వయ కమిటీ ఆధ్వర్యంలో భారీ బహిరంగ సభను నిర్వహించనున్నట్లు చెప్పారు. ప్రతి ఆదివాసీ ఈ మహాసభను విజయవంతం చేయాలని కోరారు.
ఈ కార్యక్రమంలో గౌరవ అధ్యక్షులు సిడం సాకారం, వ్యవస్థాపక అధ్యక్షులు కుర్సింగా ఓం ప్రకాష్, నేతలు సర్మెడి కొడప శంకర్, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఆత్రం బక్కయ, కోయ సంఘం జిల్లా ఉపాధ్యక్షులు మెస్రం రాజారాం, ఆదివాసీ మహిళ అధ్యక్షురాలు ఎనుకా అమృత, జిల్లా యువజన సంఘం అధ్యక్షులు మెడి సతీష్, ప్రచార కార్యదర్శి సడ్మేక రమేష్, మాజీ సర్పంచులు కొమురం హన్మంతు, కర్పేత రమేష్, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు మేకల శ్యామ్ రావు, మండల ఉపాధ్యక్షులు మనేపెళ్లి మల్లేష్ తదితరులు పాల్గొన్నారు.

Post a Comment