పాల్వంచ మండలంలో అస్తవ్యస్త రహదారులు–డ్రైనేజీల సమస్యలు వెంటనే పరిష్కరించాలి : బిఆర్ఎస్

పాల్వంచ మండలంలో అస్తవ్యస్త రహదారులు–డ్రైనేజీల సమస్యలు వెంటనే పరిష్కరించాలి : బిఆర్ఎస్


పాల్వంచ, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా: పాల్వంచ మండలంలోని రహదారులు, డ్రైనేజీలు తీవ్రంగా దెబ్బతిన్న పరిస్థితిలో ఉండటంపై బిఆర్ఎస్ పార్టీ నాయకులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. రెండు సంవత్సరాలుగా కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పటికీ రోడ్లపై తట్టెడు మట్టి కూడా వేయకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని వారు విమర్శించారు.

గ్రామ పంచాయతీ ఎన్నికలు జరక్కపోవడంతో పాలకవర్గాలు లేక గ్రామీణ అభివృద్ధి పూర్తిగా నిలిచిపోయిందని, రోడ్లు గుంటలమయంగా మారి రహదారుల రెండుపక్కల పొదలు, పిచ్చి మొక్కలు పెరిగి ప్రయాణానికి ఇబ్బందులు ఎదురవుతున్నాయని నాయకులు ఆరోపించారు. గ్రామాల్లో డ్రైనేజీలు చెత్తతో నిండిపోయి దుర్వాసనతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని పేర్కొన్నారు.

జిల్లా బిఆర్ఎస్ అధ్యక్షులు రేగా కాంతారావు పిలుపు మేరకు, పాల్వంచ మండలంలోని పలు సమస్యల పరిష్కారంపై ఎమ్మెల్యేడీవోకు వినతిపత్రం సమర్పించారు. ఈ కార్యక్రమం బిఆర్ఎస్ నాయకులు మంతపురి రాజు గౌడ్, కాంపెల్లి కనకేష్ పటేల్, కాలేరు సింధు తపస్వి ఆధ్వర్యంలో జరిగింది.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ—“పాల్వంచ మండలంలోని 36 గ్రామపంచాయతీల్లో రోడ్లు పూర్తిగా ధ్వంసమయ్యాయి. డ్రైనేజీలు చెత్త, మురుగునీటితో నిండిపోయాయి. వెంటనే రోడ్లు, డ్రైనేజీలకు మరమ్మతులు చేయాలి. కొత్త రోడ్లు నిర్మించడమే కాకుండా గ్రామ పంచాయతీ ఎన్నికలు తక్షణమే జరపాలి. లేదంటే బిఆర్ఎస్ ఆధ్వర్యంలో తీవ్ర ఆందోళనలు చేపడతాం” అని హెచ్చరించారు.

కార్యక్రమంలో బిఆర్ఎస్ నాయకులు సంగ్లోత్ రంజిత్, మారుమూళ్ల కిరణ్, పూజల ప్రసాద్, కొట్టే రాఘవేంద్ర (రవి), తోట లోహిత్ సాయి, కాలేరు అఖిల్ మహర్షి, తోట ప్రవీణ్, పోసారపు అరుణ్ కుమార్, మహమ్మద్ ఆదిల్, కుమ్మరి కుంట్ల వినోద్, గిద్దలూరి శివ సాయి, కూరెల్లి మురళీమోహన్, దాసరి సురేష్, నడిగట్ల రంజిత్, ఎస్.కె. రియాజ్, వరపర్ల జీవన్, అనిల్, ఫరీద్, షారుక్, మున్నా, హసీబ్, షరీఫ్, సాయి తదితరులు పాల్గొన్నారు.

కామెంట్‌లు లేవు

Blogger ఆధారితం.