లయన్స్ క్లబ్ అఫ్ కొత్తగూడెం మిలీనియం ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం
కొత్తగూడెం, నవంబర్ 19: లయన్స్ క్లబ్ అఫ్ కొత్తగూడెం మిలీనియం ఆధ్వర్యంలో బుధవారం ప్రభుత్వ కళాశాలలో రక్తదాన శిబిరం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి కళాశాల ప్రిన్సిపాల్ G. రమేష్ అధ్యక్షత వహించారు.
ఈ రక్తదాన శిబిరానికి ప్రోగ్రాం చైర్ పర్సన్‌గా లయన్ వెంకట పుల్లయ్య (RTA భద్రాచలం), క్లబ్ అధ్యక్షుడు లయన్ బొక్క శ్రీనివాస్, ట్రెజరర్ పగడాల నగేష్, డిస్ట్రిక్ట్ జాయింట్ ట్రెజరర్ లయన్ పితాని సత్యనారాయణ, డిస్ట్రిక్ట్ చైర్ పర్సన్స్ లయన్ JB మోహన్, లయన్ గబ్బట రాజయ్య, లయన్ గబ్బట విజయలక్ష్మి, లయన్ మండల రాజేశ్వర్ రావు, లయన్ కోటేశ్వరరావు తదితరులు హాజరయ్యారు. కార్యక్రమంలో అధ్యాపకులు, విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
శిబిరంలో మొత్తం 70 మంది విద్యార్థులు, అధ్యాపకులు స్వచ్ఛందంగా రక్తదానం చేశారు. ఈ కార్యక్రమానికి ముందుగా RTA వెంకట పుల్లయ్య, లయన్స్ బృందం కలిసి కళాశాల ఆవరణలో ఒక మొక్కను నాటారు. అనంతరం రక్తదానం యొక్క ప్రాముఖ్యత, ప్రాణాలను కాపాడగలిగే సేవా విలువలపై అవగాహన కల్పించారు.
ఈ కార్యక్రమం విజయవంతంగా నిర్వహించడంలో ప్రత్యేక కృషి చేసిన లయన్ గబ్బట విజయలక్ష్మి గారి సేవలను నిర్వాహకులు ప్రత్యేకంగా ప్రస్తుతించారు. కార్యక్రమాన్ని సమన్వయం చేయడంలో సహకరించిన అధ్యాపకులు కె. శోభనబాబు, ITI సిబ్బంది, A.I.T సిబ్బంది, హాస్పిటల్ సూపరింటెండెంట్ ఈ. మంజుల, ఫార్మసిస్ట్ విజయలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.

Post a Comment