సౌదీ అరేబియాలో ఘోర బస్సు ప్రమాదం 42 మంది సజీవ దహనం
సౌదీ అరేబియాలో జరిగిన భయానక రోడ్డు ప్రమాదం భారీ ప్రాణ నష్టానికి దారి తీసింది. మక్కా నుంచి మదీనా దిశగా ప్రయాణిస్తున్న ప్రయాణికుల బస్సు, బదర్-మదీనా హైవే వద్ద డీజిల్ ట్యాంకర్‌ను ఢీకొట్టడంతో ఒక్కసారిగా భారీ అగ్నిప్రమాదం సంభవించింది. ఢీకొన్న కొన్ని క్షణాల్లోనే మంటలు వ్యాపించి బస్సు పూర్తిగా దగ్ధమైంది.
ఈ ఘటనలో స్థలంలోనే 42 మంది సజీవ దహనమై మృతి చెందారు. మృతి చెందిన వారిలో 20 మంది మహిళలు, 11 మంది చిన్నారులు ఉన్నట్లు ప్రాథమిక సమాచారం. మరణించిన వారిలో హైదరాబాద్‌కు చెందిన వారు ఎక్కువ మందిగా తెలుస్తోంది. అయితే బాధితుల పూర్తి వివరాలు, వారి గుర్తింపు సమాచారం ఇంకా వెల్లడికావాల్సి ఉంది.
స్థానిక పోలీసులు, రెస్క్యూ బృందాలు ఘటనాస్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టాయి. ప్రమాదానికి గల కారణాలు, డ్రైవర్ల స్థితి, ట్యాంకర్ వివరాలపై దర్యాప్తు కొనసాగుతోంది.

Post a Comment