అదనపు కట్నం వేధింపులు భరించలేక 7 నెలల గర్భిణి ఆత్మహత్య

అదనపు కట్నం వేధింపులు భరించలేక 7 నెలల గర్భిణి ఆత్మహత్య


కరీంనగర్ జిల్లా ఇల్లందకుంట మండలం శ్రీరాములపల్లి గ్రామంలో చోటుచేసుకున్న ఘటన జిల్లా వ్యాప్తంగా దిగ్బ్రాంతి కలిగించింది. అదనపు కట్నం కోసం భర్త నుంచి జరుగుతున్న నిరంతర వేధింపులను భరించలేక, ఏడు నెలల గర్భిణి అయిన మౌనిక (23) ఆత్మహత్యకు పాల్పడింది.

పోలీసుల సమాచారం మేరకు— శ్రీరాములపల్లికి చెందిన మౌనికకు భూపాలపల్లి జిల్లా ఘనపురం మండలం బుద్దారం గ్రామానికి చెందిన ప్రశాంత్‌తో కొద్దికాలం క్రితం వివాహం జరిగింది. వివాహానంతరం కొంతకాలం సవ్యంగా సాగిన దాంపత్యం తరువాత, ప్రశాంత్ అదనపు కట్నం కోసం మౌనికను తరచూ వేధిస్తూ వచ్చాడని కుటుంబ సభ్యులు ఆరోపించారు.

వేధింపులు రోజురోజుకూ పెరగడంతో తీవ్ర మనస్తాపానికి గురైన మౌనిక, గురువారం ఉదయం ఇంట్లోనే ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. ఏడు నెలల గర్భిణిగా ఉన్న మౌనిక మృతి కుటుంబాన్ని విషాదంలో ముంచేసింది.

తన కూతురి మరణానికి కారణమైన ప్రశాంత్‌పై కఠిన చర్యలు తీసుకోవాలని మౌనిక తల్లి, బంధువులు డిమాండ్ చేస్తున్నారు. ఘటనపై మౌనిక కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న ఇల్లందకుంట పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

కామెంట్‌లు లేవు

Blogger ఆధారితం.