గాంధీ భవన్‌లో టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ గౌడ్‌కు ఘన సన్మానం
నిజామాబాద్ జిల్లా భీంగల్ మండలం లింబాద్రిగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి దేవస్థానం అభివృద్ధికి కీలకమైన మద్దతు అందించిన టీపీసీసీ అధ్యక్షులు, ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్‌ను గాంధీ భవన్ ప్రాంగణంలో ఆలయ అర్చకులు పార్థసారథి, గ్రామ ప్రజలు ఘనంగా సన్మానించారు.
లింబాద్రిగుట్ట పర్యాటక అభివృద్ధి కోసం టూరిజం గెస్ట్ హౌస్ నిర్మాణానికి రూ.4 కోట్లు మంజూరు అయ్యేలా ప్రత్యేకంగా కృషి చేసినందుకే ఈ సన్మానం నిర్వహించినట్లు గ్రామస్థులు పేర్కొన్నారు. ఆలయానికి పెద్ద సంఖ్యలో విచ్చేసే భక్తుల కోసం వసతి సౌకర్యాలు అత్యవసరమని, గెస్ట్ హౌస్ నిర్మాణం ఆ అవసరాన్ని తీర్చబోతోందని వారి అభిప్రాయం.
ఈ సందర్భంగా మహేష్ కుమార్ గౌడ్ మాట్లాడుతూ—లింబాద్రిగుట్ట పవిత్రక్షేత్రంగా పురాతనత, ఆధ్యాత్మికత కలిగిన ప్రదేశమైందని చెప్పారు. భక్తులకు మరింత మెరుగైన వసతులు, సౌకర్యాలు కల్పించే దిశగా ప్రభుత్వం నుంచి ఇంకా అనేక అభివృద్ధి కార్యక్రమాలను తీసుకురావడానికి కృషి చేస్తామని హామీ ఇచ్చారు.
లింబాద్రిగుట్ట అభివృద్ధి దిశగా ఈ నిర్ణయం స్థానికులలో ఆనందాన్ని నింపింది.

Post a Comment