హిజ్రా కమ్యూనిటీలో ఘర్షణ… ఆవేశంలో ఓ వ్యక్తి ఆత్మదాహయత్నం

 

హిజ్రా కమ్యూనిటీలో ఘర్షణ… ఆవేశంలో ఓ వ్యక్తి ఆత్మదాహయత్నం

హైదరాబాద్, బోరబండ – నవంబర్ 18: హైదరాబాదులోని బోరబండ ప్రాంతంలో మంగళవారం ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. తమ సమూహానికి చెందిన ఒక వ్యక్తి కేసుల పేరుతో ఇతరులపై వేధింపులు పెంచుతున్నాడని ఆరోపిస్తూ హిజ్రా కమ్యూనిటీకి చెందిన పలువురు రోడ్డుమీదకు వచ్చి ఆందోళన చేపట్టారు.

ఈ సమయంలో ఆవేశానికి లోనైన ఓ వ్యక్తి ఒంటిపై పెట్రోల్ పోసుకొని నిప్పంటించుకునే ప్రయత్నం చేయడంతో పరిస్థితులు ఒక్కసారిగా విషమించాయి. అప్పటికే అక్కడ ఉన్న పోలీసులు వెంటనే స్పందించి మంటలను ఆర్పేందుకు ప్రయత్నించారు.

ఈ ఘటనలో ఆత్మదాహయత్నం చేసిన వ్యక్తితో పాటు మరో ఇద్దరు హిజ్రాలు, అలాగే వారిని ఆపేందుకు ప్రయత్నించిన ఇద్దరు పోలీసు సిబ్బంది గాయపడ్డారు. వారిని అత్యవసరంగా సమీపంలోని ఆసుపత్రికి తరలించారు.

పరిస్థితి అదుపులోకి వచ్చినట్లు పోలీసులు వెల్లడించారు. ఘర్షణకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

కామెంట్‌లు లేవు

Blogger ఆధారితం.