జిన్నింగ్ మిల్లులో అగ్ని ప్రమాదం ఇద్దరు కార్మికులు మృతి – మరో ముగ్గురు గాయాలు

 

జిన్నింగ్ మిల్లులో అగ్ని ప్రమాదం ఇద్దరు కార్మికులు మృతి – మరో ముగ్గురు గాయాలు

బ్రేకింగ్ న్యూస్ — మహ‌బూబ్‌న‌గర్‌లో విషాదం

మహబూబ్‌నగర్ జిల్లా జడ్చర్ల మండలం గొల్లపల్లి గ్రామంలో ఉన్న సలసర్ బాలాజీ జిన్నింగ్ మిల్లో గురువారం ఉదయం ఆకస్మికంగా అగ్ని ప్రమాదం సంభవించింది. ప్రారంభ సమాచారం మేరకు షార్ట్ సర్క్యూట్ కారణంగా మంటలు చెలరేగినట్లు అధికారులు వెల్లడించారు.

ఈ ఘటనలో ఒడిశాకు చెందిన కార్మికులు పప్పు, హరేందర్ అక్కడికక్కడే మృతి చెందగా, మరో ముగ్గురు కార్మికులు తీవ్రంగా గాయపడ్డారు. గాయపడిన వారిని స్థానిక ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.

అగ్నిమాపక సిబ్బంది వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని మంటలను నియంత్రించారు. మిల్లో భారీగా పొగలు వ్యాపించడంతో క్షణాల్లోనే అక్కడ ఉన్న కార్మికులు తప్పించుకునేందుకు ప్రయత్నించారు. ప్రమాదంపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.

కామెంట్‌లు లేవు

Blogger ఆధారితం.