రోడ్డు బ్లాక్ చేసి ఇంటి స్లాబ్ పనులు – ప్రజలకు తీవ్ర ఇబ్బందులు
చుంచుపల్లి (భద్రాద్రి కొత్తగూడెం): చుంచుపల్లి మండలంలోని వెంకటేశ్వర కాలనీ దర్గా రోడ్డులో ఒక వ్యక్తి ఇంటి నిర్మాణ పనుల కోసం రోడ్డునే ఆక్రమించి సిమెంట్, ఇసుక వేసి స్లాబ్ పనులు చేపట్టడంతో స్థానికులకు తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయి.
రోడ్డు పూర్తిగా మూసుకుపోవడంతో మహిళలు, విద్యార్థులు, వృద్ధులు రాకపోకల్లో ఇబ్బందులు పడుతున్నారు. ఈ విషయంపై కాలనీ ప్రజలు అసంతృప్తి వ్యక్తం చేస్తూ అధికారుల జోక్యాన్ని కోరుతున్నారు. ప్రజా రహదారిపై నిర్మాణ సామగ్రిని ఉంచడం చట్టవిరుద్ధమని వారు పేర్కొన్నారు.
స్థానికులు సంబంధిత గ్రామపంచాయతీ, పోలీస్ అధికారులు వెంటనే స్పందించి రోడ్డును క్లియర్ చేయాలని డిమాండ్ చేశారు.

Post a Comment